టిక్‌టాక్ యొక్క #యేమేరాఇండియా తో భారతదేశంలో ప్రయాణించండి

మనలో చాలా మందిమి ప్రయాణించాలని ఆశిస్తాము. ప్రయాణించాలి అనే ఆలోచన భోజనం బల్ల వద్ద మొగ్గతొడిగినప్పుడు,    భారత దేశపు ఉన్నతమైన భిన్నత్వాన్ని అన్వేషించాలని ఇష్టపడే ప్రతి ఒక్కరూ వారు వెళ్ళాలని ఆశించే జాబితాలో ఒక ప్రదేశాన్ని సిద్ధంగా కలిగి ఉంటారు. ఇదంతా అలా ఉండగా భారత గడ్డ మహాసముద్రాలు. నదులు, మైదానాలు, కొండలు, మైదానాలు మరియు లోయలలో తన గొప్పతనాన్ని చూసుకునే ఒక సమాహారం. మనం దీన్ని ఆస్వాదిద్దాం. ఇటువంటి గొప్ప భిన్నత్వాన్ని తాము కలిగిఉన్నట్లు చెప్పుకునే దేశాలు ఎన్నో లేవు. ఈ చిత్రం ఒక స్వీయ వివరణను కలిగి ఉంది. మిలియన్ల కొద్దీ ప్రయాణికులు పంచుకున్న వీడియోలు కూడా అంతే.

ప్రపంచ ప్రసిద్ధ క్లుప్త రూప మొబైల్ వీడియోల వేదిక టిక్‌‌టాక్ పై మీరు భారతదేశాన్నంతటినీ తరచి చూడవచ్చని మీకు తెలుసా. టిక్‌‌టాక్ ఇటీవలే తన యాప్-అంతర ప్రయాణ ప్రచార కార్యక్రమం యొక్క భారతదేశపు ఎడిషన్‌‌, #టిక్‌‌టాక్‌‌ట్రావెల్ ను ప్రారంభించింది. స్థానిక యాప్-అంతర కార్యక్రమమైన #యేమేరాఇండియా, టిక్‌‌టాక్ యూజర్లను వారి యాత్రా క్షణాలను ప్రపంచంతో పంచుకోవడానికి ఆహ్వానించడం ద్వారా భారత దేశాన్ని ఒక కీలక ప్రపంచ యాత్రా గమ్యంగా పరిచయం చేస్తుంది. అధిక నాణ్యతకల ఎడిటింగ్ టూల్స్‌‌ మరియు విస్తృతమైన యూజర్ బేస్‌‌తో కూడిన టిక్‌‌టాక్ యొక్క సులభంగా ఉపయోగించగలిగే ఇంటర్ఫేస్‌‌తో, తమ రాష్ట్ర టూరిజంకు ప్రాచుర్యం కలిగించడానికి ఒక అధికారిక టిక్‌‌టాక్ ఖాతాను ప్రారంభించడానికి కేరళ టూరిజం కూడా చేయి కలిపింది .

టిక్‌‌టాక్‌‌తో ప్రయాణించండి

 అసలైన ప్రయాణ క్షణాలను ప్రదర్శిస్తూ #ట్రావెల్ క్రింద పోస్ట్ చేసిన వందల వేల వీడియోలతో మరియు మొత్తంగా 2.5 బిలియన్ల వ్యూలతో టిక్‌‌టాక్ ఖ్యాతి నానాటికీ వృద్ధి చెందుతుంది. స్ట్రీట్ ఫుడ్‌‌ను రుచి చూస్తూ వేర్వేరు సంస్కృతులతో మమేకమైపోవడం వంటి విధానాల ద్వారా ప్రకృతితో సంబంధాలను నెరిపే క్రియేటర్ల నుండి విశిష్టమైన స్థానిక అనుభవాల కోసం ప్రయత్నించే పరిధి వరకు ఈ వీడియోలు కలిగి ఉంటాయి. టిక్‌‌టాక్ యూజర్లు షేర్ చేసిన వాటిలో కొన్ని వీడియోలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

ఒక విహంగ వీక్షణ: టిక్‌‌టాక్ యూజర్ @anisippi పశ్చిమ బెంగాల్‌‌ లోని బగ్దోరా ఎయిర్‌‌పోర్ట్‌‌ వద్ద ల్యాండ్ అవ్వబోతున్న తమ విమానం నుండి తీసిన ఈ వ్యూను షేర్ చేసారు. క్షితిజాన్ని తాకబోతున్నట్లుగా కలిపించే నీలి ఆకాశం మరియు దట్టమైన మేఘాలు ఒక అందమైన వీడియోగా మలచబడ్డాయి. మీరు దానిని ఇక్కడ చూడవచ్చు.

సర్పెంటైన్ రోడ్: టిక్‌‌టాక్ యూజర్ అయిన @droneholic చే షేర్ చేయబడిన ఈ వీడియో తమిళనాడులోని కోయంబత్తూర్‌‌ జిల్లాలోని వల్పరై వద్ద ఉన్న ఒక సర్పెంటైన్ రోడ్డును చూపిస్తుంది. టీక్‌‌టాక్ యూజర్‌‌నేమ్ లాగే ఈ వీడియో ఒక డ్రోన్ నుండి తీయబడి క్రింద ఉన్న ఘాట్‌‌ల అద్భుతమైన వీక్షణను ఇస్తుంది. రోడ్డు ఎన్నో వంపులు కలిగి ఉంది, ఒక వ్యక్తైతే తాను రోడ్డును చూచి పాముగా అభిప్రాయపడినట్లు కామెంట్ల విభాగంలో తెలిపారు. వీడియోను ఇక్కడ చూడండి.

యాత్ర: చాలా మందికైతే వైష్ణోదేవి వద్దకు వెళ్ళడాన్ని తప్పనిసరి అంశంగా భావిస్తారు. దర్శనం పొందటానికి అల్లడి ప్రజలు చివర్లో 4 రోజులపాటు ట్రెక్కింగ్ చేసి గంగాజలాన్ని తీసుకుని సంతృప్తితో తిరిగివెళ్తారు. టిక్‌‌టాక్ యూజర్ అయిన @kunal_xl కొంత దూరం నుండి దేవాలయాన్ని షూట్ చేయడం కొరకు మరి కొన్ని అడుగులు పైకి ఎక్కి  మరో అడుగు ముందుకు వేసారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 212,000 లైక్స్ వచ్చాయి. దానిని మీరు ఇక్కడ చూడండి.

బోర్న్ ఫ్రీ: భారత దేశం గొప్పగా చెప్పుకునే మరో అంశం భిన్న అటవీ ప్రాణులు. భారతదేశం తనలోని సింహాలు, చిరుతలు, మరియు పాంథర్స్ గురించి గర్వంగా చెప్పుకుంటుంది. రైనోలు, జింకలు, బైసన్ మరియు అడవిలో సంచరించే వివిధ రకాలైన  పక్షులు ఉంటాయి. వన్యప్రాణులపై ఎంతో ఆసక్తిని కలిగియున్నట్లు కలిపించే టిక్‌‌టాక్ యూజర్ అయిన చిరాగ్ శర్మ, ఈ ఆడ సింహాల అత్యద్భుతమైన క్లోజప్ వీడియోను షేర్ చేసారు. ఇది గుజరాత్ లోని గిర్ అడవుల్లో తీసినట్లుగా అది కనిపిస్తుంది.. వీడియోను ఇక్కడ చూడండి.

అయితే ఇక దేనికోసం చూస్తున్నారు మీ తదుపరి ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవడానికి ముందు టిక్‌‌టాక్ తెరవండి!!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.