ఈనాటి సాయము సంధ్యా సమయములో,  అమ్మ పెంచిన రోజా తోటలో కుర్చీ వేసుకొని కూర్చుని, దూరముగా దసరా పండాలలో నుంచి వినిపిస్తున్న పాటలు వింటున్న నాకు, మా అమ్మ గుర్తు వచ్చింది, తన మాటలు, తన పట్టుదల గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ రోజు అమ్మ నన్ను చూసి సంతోషించేదా, ఇంకా నేను చేయాల్సిన పనుల గురించి గుర్తు చేసేదా అన్న ఆలోచన వచ్చింది. ఆ ప్రశ్నకి మీకు జవాబు తెలియాలి అంటే, మరి ఇంతవరకు జరిగిన నా జీవన ప్రయాణము గురించి మీకు తెలియాలి కదా.

Image result for thinking old lady image
Picture Courtsey: ShutterStock

  నా ఇద్దరు పిల్లలు, జీవితములో బాగానే సెటిల్ అయ్యారు అంటే, నేను అంతా మా అమ్మ ఆశీర్వాదము, ఆ భగవంతుడి దయ అంటాను.  అమ్మగా నా జీవితము, విజయనగరము పక్కనే ఉన్న చిన్న పల్లెటూరులో  (అలమండ) ప్రారంభము అయ్యింది. అంతకు ముందు, ఈ టాటా నగర్లోనే చిన్న పిల్లగా ఆడుతూ పాడుతూ చదువుకొనే నేను, ఒక్కసారిగా, పెద్ద కోడలిగా, వరుసకి నాకు వేలు విడిచిన మేనమామ ఇంటికి మా బావని పెళ్లి చేసుకొని, అలమండ కి వెళ్ళాను.
అక్కడ అంతా కొత్తే నాకు, బొగ్గుల కుంపటి నుంచి, ఆరు బయట మరుగు దొడ్ల వరకు. తినే తిండి కూడా వేరే. అంత వరకు అన్నము పండుగ రోజు మట్టుకే తినే నాకు చపాతీలు అసలు తెలియని ఊరు కూడా ఉంటుంది అని మొదటి సారిగా తెలిసింది. భాష వేరు ఆచారాలు వేరు. నాకు కొద్దీ కొద్దిగా తెలిసిన తెలుగు లోనే అక్కడ అంతా మాట్లాడుతారు.  అన్ని అర్ధము చేసుకొని,  అలవర్చుకొంటూ, పెద్ద కోడలి భాద్యతలు నేర్చుకొనే లోపలే, ఇద్దరు పిల్లలు పుట్టేసారు, వాళ్ళుకి స్కూల్కి వెళ్లే వయసు కూడా వచ్చేసింది. ఎంత అయినా, ఆ ఊరి మాస్టారుగారి పిల్లలుగా, అదే ఊరిలోని స్కూలులో చదువుకోవటం మొదలు పెట్టేసారు కూడా.

చిన్న గ్రామాలలో, స్కూలు మాస్టారు అంటే, గుడిలో దేవుడి కంటే ఎక్కువుగా గౌరవము ఇస్తారు, ఇంకా మాస్టారు పిల్లలు అంటే, ముద్దు ఎక్కువే అందరికి మరి. ఆ ముద్దుతోనే, పిల్లలు పాడు అవుతున్నారు అనిపించింది. అమ్మని అడిగాను, నాకు తోడుగా వస్తావా, మనము పిల్లలిని  బయట వేరే స్కూల్లో వేసి చదివిద్దాము అని. దాంతో ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. పెద్ద కోడలు వేరే కాపురము అంటుంది అంటూ. నేను వేరే కాపురము అడగలేదు. మా బావని, ఉమ్మడి కుటుంబానికి ఆ భాద్యతలకి వదిలేసి, అమ్మ సహాయముతో, భీమిలిలో వేరే కాపురము పెట్టి, వాళ్ళని చదివించాను. కానీ ఇక్కడ ఒక్కసంగతి ఒప్పుకోవాలి. నా పిల్లలు నిజ్జముగా ముత్యాలు లాంటి వారు. చిన్న పిల్లలు అయ్యిన కూడా , నా తాపత్రయము అర్ధము చేసుకొని సహకరించారు. పండగలకి పబ్బాలకి, పెద్ద కోడలు భాద్యతలు నిర్వర్తించడానికి అలమండ పరిగెట్టేదాని, అప్పుడు కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గర గొడవ చేయకుండా ఉండేవారు.
ఇక్కడ ఒక్క చిన్న సంఘటన చెప్పుకోవాలి. మా చిన్న వాడికి స్కూల్లో అడ్మిషను లేదు అన్నారు. కానీ, మా అమ్మ ఉరుకోలేదు, వాడిని కూడా స్కూల్లో వదిలి వచ్చేది రోజు. పాపమూ, మా వాడు, ఏమి చేయాలో తెలియక వారము రోజులు క్లాస్ బయట కూర్చున్నాడు. ఇంటికి వచ్చేస్తే, అమ్మమ్మ తిడుతుంది, క్లాసులోకి మాస్టారు రానివ్వడు. ఏమి చేయాలో తెలియక ఆలా చేసాడు అట. అది చూసి ఇంకా తప్పని పరిస్థితిలో ఆ స్కూలు ప్రిన్సిపాల్ మా వాడికి అడ్మిషను ఇచ్చేసాడు.

 పిల్లలు కొంచెము కొంచెముగా ఎదుగుతున్నారు, బాగా చదువుకుంటున్నారు అనే లోపలే, మా నాన్నగారి కి ఆరోగ్యము పాడు అయ్యింది. దాంతో అమ్మ, నాన్నను తీసుకోని, వెల్లూరు హాస్పిటల్కి వెళ్లి పొయ్యింది. ఇంకా పిల్లలిని ఎక్కడ ఉంచాలో అర్ధము కాలేదు. మా ఆడపడుచుని బతిమాలి వాళ్ళ ఇంట్లో ఉంచి చదివించాము. ఆయినా కూడా పిల్లలు ఎక్కడ చదువు మానేస్తాము అని అనలేదు. ఇంకా వాళ్ళు కాలేజీకి వచ్చేటప్పటికి నా ఒంటి మీద నగలు తరిగిపోవటం మొదలు అయ్యింది. ఉమ్మడి కుటుంబపు భాద్యతలు కూడా మింగని నా నగలు, పిల్లల చదువులకి ఖర్చు పెట్టాము.

మంచి మార్కులు వచ్చిన పిల్లలిని బయట ఊరికి పంపి చదివించే స్తొమత లేక విశాఖపట్నంలో ఉండే చదువే కొనసాగించామన్నాము. ఇంతలో చిన్న వాడికి ఐఐటీ  ఖరాగపూర్ లో సీట్ వచ్చింది. ఇంకా తప్పలేదు, తొడ పుట్టిన అన్న తమ్ములని డబ్బులు అడగాలిసివచ్చింది. పెద్ద వాడు, పీహెచ్డీ చేసి, ఇండియాలో సరి అయ్యిన ఉదోగాము దొరక్క ఎంత బాధ పడ్డాడో నాకు మాత్రమే తెలుసు. ఆ భగవంతుడి దయ వల్ల ఈ రోజు వాడు సౌత్  ఆఫ్రికాలో  మంచి పోస్టులో ఉన్నాడు.  చిన్న వాడు చెన్నైలోనే మంచి ఉద్యోగములో ఉన్నాడు.
మా పిల్లలు వాళ్ళకి నచ్చిన ఉద్యోగము కొరకు ఊరు విడిచి వెళ్ళటప్పుడు అంతే. చుట్టూ పక్కల వాళ్ళనుంచి ఎన్ని మాటలు పడ్డానో నాకే తెలుసు. నాకు డబ్బు పిచ్చి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఎవ్వరి మాటలిని లెక్కపెట్టలేదు. ఆ పట్టుదలే, నాకు మా పిల్లల పెళ్లిలప్పుడు కూడా పనికి వచ్చింది. వారికీ నచ్చిన అమ్మాయిలిని ఇచ్చి పెళ్లి చేసినపుడు కూడా అంతే.  ఎక్కువ చదువుకున్న అమ్మాయలు వస్తున్నారు, వారు నిన్ను పట్టించుకోరు అన్న వాళ్ళు అందరు ఇప్పుడు నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అంటున్నారు. ఇక్కడ అదృష్టము కాదు, పిల్లల ఇష్టము మనము కాదు అనకపోవటం అని ఎవ్వరు గుర్తించరు.

ఇప్పుడు మా పెద్ద వాడికి ఇద్దరు పిల్లలు. చిన్న వాడికి ఒక్క కొడుకు. మనవలలో మా పిల్లల చిన్నతనము, వారి అట పాటలు వెతుక్కునే సమయము వచ్చేసింది. 
తెరిపిన పడ్డాము అనే అంతలోనే, మా వారికీ ఆరోగ్యము పాడు అయ్యింది. వారిని చిన్న పిల్లాడిలా చూసుకోవాలిసి వచ్చింది. ఆ హడావిడిలో, ఇద్దరు పెద్ద మనవలు ఎప్పుడు పెద్ద వాళ్ళు అయ్యారో కూడా గమనించలేదు. ఇప్పడు చిన్న మనవడి ఆట పాటలలో నా కాలము గడిచిపోతుంది. మా చిన్న కోడలు ఇప్పుడు నాకు ఇంకో పని అప్పచెప్పింది. అది ఏమిటి అంటే, నా చిన్న మనవడిని, మా పిల్లలాగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అంటుంది. ఎందుకు అంటే,  మా చిన్న కోడలి భాషలోనే చెప్పాలి దానికి కారణము కూడా.  మా పిల్లలు ఇద్దరినీ, రేమండ్ అడ్వేర్దిజెమెంట్లో వచ్చే కంప్లీట్ మాన్ లాగా పెంచాను అట. తాను ఈ రోజు ఇంత ఆనందముగా ఉంది, అంటే, నేనే కారణమూ అట. నాకు కొంచెము గిల్టీగా ఉంటుంది, ఆ మాటలు వింటే. తాను నా గురించి చాల ఎక్కువుగా వుహిస్తోంది అని. కానీ #తల్లిగా నేను గెలిచాను అని కూడా అనిపిస్తుంది. 

నేను ఈ ప్రయాణములో నేర్చుకున్నది, మనము మన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తే, ఆ దేవుడే, మనకి మంచి చేస్తాడు అని. అదే నేను ఇప్పుడు నా కోడళ్ళకి, మనవలకి నేర్పిస్తున్నది కూడా.  ఎప్పుడు మనము అనుకున్నదాని సాధించేవరకు ఓటమి ఒప్పుకోకూడదు  అని.

 రచయత మాట: ఈ కథ మా అత్తగారిది. నాకు తెలిసిన చాల కొన్ని సంగతులతో రాసిన కథ ఇది. ఇవి అని నేను మా మావగారు, మా శ్రీవారి నుంచి విన్నవే. ఇంత వరకు ఏ నాడు మా అత్తగారు నేను ఇన్ని కష్టాలు పడ్డాను అని ఎవరికీ చెప్పలేదు.

This article has originally published in Momspresso