మా వాడు ఎవరితోను ఆడడు అని అనుకున్నని రోజులు పట్టలేదు, మా వాడు ఇంట్లోకి అసలు రావటంలేదు అని అనుకోవటానికి. నిజము చెపితే మీరు నమ్మరు కానీ, మా వాడు ఇలా ఇంత ఇంత సేపు బయట ఆడుకోవటానికి  వెళ్ళితే నాకు బోరుగానే ఉంది, కానీ మా వాడు జీవితములో స్వతంత్రముగా బతకటానికి వేయవలసిన తోలి అడుగు కాబట్టి వదిలేసాను.

ఆటలతో పాటు గొడవలు పడటం చిన్న పిల్లల అలవాటే కదా అనుకున్నాను. కానీ తరిచి చూస్తే ఇద్దరు అబ్బాయిల మధ్య తగవులకి, అమ్మాయిల మధ్య తగవులకి బోలెడు తేడా ఉంది సుమా.
ఇంకా ఒక్క అమ్మాయి, అబ్బాయి మధ్య గొడవలు ఇంకో రకం. అబ్బాయిల మధ్య గొడవలు చాల వరకు, ఎవరు ముందు, ఎవరు గొప్పగా ఆడారు అన్న వాటితోనే ఆగిపోతాయి. ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవలు చాలా వరకు ఎవరు కోట్టారో తో మొదలు అయినా, ఎవరు ఎక్కువ అనే దగ్గర ఆగిపోతాయి.  ఇంక మూడో రకం ఉన్నాయే వాటిని వివరించటం  చాలా కష్టం.

ఇద్దరు అబ్బాయిల మధ్య గొడవలకి మొట్ట మొదటి కారణము ఏమిటి అంటే, ఎవరు మొదటగా బాల్ వేయాలి, ఎవరు గట్టిగా కొట్టారు అనే  వంతులు  అంతే. రెండో వాడికి ఆవకాశము వస్తే, తాను మొదటి వాడి కంటే ఇంకా బాగా ఆడగలను అని చూపించకుంటే చాలు, వీళ్ళకి ఇంక ఏమి అక్కరలేదు. వీళ్ళ గొడవలు తాటకు మీద మంట లాంటివి, ఎక్కువ సేపు ఉండవు. ఎంత వేగముగా కొట్టుకొంటారో, అంటే వేగముగా కలిసిపోతారు. మనకి అసలు పని పెట్టరు. ఇంకో పక్క, ఇద్దరు అమ్మయిల మధ్య గొడవలు వస్తే, ఇంకా అది మూడో ప్రపంచ యుద్ద సంకేతాలే సుమా,
మనము తొందర పడి ఆపక పోయామో అవి  గాలి వాన ముదిరితే తుఫాన్ గాలులుగా ఎలా మారిపోతయో ఆలా మారిపోతాయి, అది కూడా చాలా తొందరగా. ఆపటానికి వెళ్ళామో మనము ఆ జడివానలో కొట్టుకుపోతాం సుమా.  ఒక్కరూ  కూడా తగ్గారు, మనము ఎవరి వైపు మాట్లాడిన, రెండో వారి అలకకు ఇంకా అంతు ఉండదు. కాబట్టే మనము అక్కడి నుంచి దూరముగా జరిగి పోవటం చాలా మంచిది.  అలానే వదిలి వేశామో వారి ఏడుపుల వరదలో మనం కొట్టుకుపోవాల్సిందే. ఇక వారి ఇద్దరినీ సముదాయించే లోపల మన పని అయిపోతుంది.

ఇంకా అమ్మాయి, అబ్బాయి మధ్య గొడవలు అనుకోండి, అవి తెగటానికి కారణమూ ఒక్కటి చాలు. ఆ అమ్మాయే, తన బెస్ట్ ఫ్రెండ్ అని అబ్బాయి, కొంచము బతిమాలుకుంటే చాలు, అమ్మాయి ఒప్పేసుకొంటుంది. కానీ ఇక్కడ గొడవలు ఎవరు మొదలు పెట్టినా సరే, ఇద్దరికీ రాజి కుదర్చటము చాలా సులువు.

 ఎవరి గొడవలు పెద్దవి, ఎవరి గొడవలు చిన్నవి అని ఆలోచించే బదులు, ఏ గొడవ అయినా మన వాడు, స్వయంగా తీర్చుకొనే అలవాటు చేయటము చాల మంచిది. ప్రతి గొడవలో, మనము దూరకుండా ఉన్నవరకు అని గొడవలు చిన్నవే, ఇట్టే సమసిపోయేవే. పెద్దవాళ్లు తల దూర్చారో, చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవి అయిపోతాయి. ఇదే అందరు పాటించాల్సిన సూత్రం.

Author’s note:
This article was originally published at: Momspresso